Chandrababu: చంద్రబాబు ఇంటికి పోలీసులు
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 160 సీట్లలో కూటమి లీడ్ లో ఉంది.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 160 సీట్లలో కూటమి లీడ్ లో ఉంది.
AP: ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్ టీడీపీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురయ్యారు. నర్సరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని టీడీపీ నేతలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు టీడీపీ కూటమిదే విజయం అని చెప్పడంతో, ఆ పార్టీ మరో ఆలోచన చేయడం లేదు.
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు నెలకొన్న పల్నాడు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రేపటి కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేశారు.
పల్నాడు జిల్లాలో పోలీస్ అధికారులు హై అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ సమయంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరింత అప్రమత్తమయ్యారు. నరసరావుపేట మండలం కాకాని జేఎన్టీయూ కాలేజ్ కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు.
ఆంధప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్ పోల్ స్టడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలున్నాయి. ఇందులో 16 టీడీపీ, 1 జనసేన గెలవబోతున్నట్లు తేలింది. అభ్యర్థుల పూర్తి వివరాలకోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీంకోర్ట్ షాక్ ఇచ్చింది. ఈవీఏం ధ్వంసం కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటింగ్ సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బెయిల్‌ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది.
నరాసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మీద అడ్డంగా పడిన చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
AP: మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను టీడీపీ అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.