Macherla : ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట... మధ్యంతర బెయిల్ పొడిగింపు!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
16 ఎంపీలతో కేంద్రంలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయి? అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం హ్యాట్రిక్ ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పదవులు పక్కా అని తెలుస్తోంది.
టీడీపీ అధికారంలోకి రావడంతో నారా లోకేష్ గతంలో చెప్పినట్లుగా రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న చర్చ సాగుతోంది. RTV వద్ద ఉన్న రెడ్ బుక్ వివరాల కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్లండి.
పల్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. EVM ధ్వంసం కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సంతకం చేసేందుకు వెళ్లారు. అనంతరం మళ్ళీ తన ఇంటికి చేరుకున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు పిన్నెల్లి ఇంటి వద్దే ఉండనున్నారు.
AP: వైసీపీ ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు చేశారు.
AP: చంద్రబాబు కేబినెట్లో పవన్ కళ్యాణ్ చేరే అంశంపై సస్పెన్స్ నెలకొంది. పవన్ మంత్రివర్గంలో చేరితే డిప్యూటీ సీఎంతో పాటు రెండు కీలక శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
AP: నేటితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ గడువు ముగుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసుతో సహా మరో రెండు కేసులపై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా? లేదా అరెస్ట్ అవుతారా? అనే ఉత్కంఠ పల్నాడులో నెలకొంది.
టీడీపీ విజయం, మళ్లీ చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అమరావతిలో మళ్లీ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయన్న చర్చ సాగుతోంది. వారంలోనే ఆగిపోయిన ప్రభుత్వ భవనాలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ను ఈ వీడియోలో చూడండి.