గురుపూర్ణిమ వేడుకల్లో చంద్రబాబు
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు.
జగన్ ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్నాడని.. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. నిరూపించకపోతే జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టేందుకు వెనకాడమన్నారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
AP: వైసీపీ అధినేత జగన్ ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌కు చేరుకోనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ కు వివరించనున్నారు.
AP: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు.
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.
AP: రాష్ట్రంలో హత్యలు, దాడులు, ఇతర హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో గళమెత్తాలని వైసీపీ ఎంపీలతో అన్నారు జగన్. 15 సంవత్సరాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబు ఆశించినట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కలేరని అన్నారు.
ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో మరికొన్ని వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది.