ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీ అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ AP: అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరుకానున్నారు. జగన్ తో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా మాజీ సీఎం కాబట్టి అసెంబ్లీలోకి వచ్చేందుకు జగన్ కారుకు అనుమతిచ్చినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా, కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యంగ్ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజ రానున్నారు.ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Meet: నేడు, రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు, రేపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9.44 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలిరోజు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెండో రోజు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సాధారణ సభ్యుడిగానే వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu-Jagan: దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే జగన్ కు 11 సీట్లు.. చంద్రబాబు చెప్పిన లెక్క ఇదే! అమరావతి కోసం ప్రజలు 1631 ఉద్యమం చేశారని చంద్రబాబు అన్నారు. ఇందులోని అంకెలను కలిపితే 11 అని.. వైసీపీకి వచ్చిన సీట్లు కూడా అంతేనన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో అంగుళం కూడా పని జరగలేదని నాటి జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. By Nikhil 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: రేపే ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. సాధారణ సభ్యుడిలాగే జగన్ కూడా..! రేపు ఏపీ ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా సీఎం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడంతో ఆయన సాధారణ సభ్యుడిలాగే ప్రమాణం చేయనున్నారు. By Nikhil 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్ AP: జగన్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాధనంతో కొన్న ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే అప్పగించాలని జగన్‌కు సాధారణ పరిపాలనశాఖ అధికారులు లేఖ రాశారు. కాగా దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nimmala Rama Naidu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pinnelli Ramakrishna Reddy : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ తప్పదా? AP: ఈరోజు హైకోర్టులో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో రెండు కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కాగా ఆయనకు బెయిల్ పొడిగిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Meeting: జగన్ మీటింగ్‌కు కీలక నేతల డుమ్మా! AP: తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. సమావేశానికి ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారు. బెంగళూరు నుంచి వస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ విమానం రద్దు కావడంతో వారు ఈ మీటింగ్‌కు హాజరు కావడం లేదని తెలిపారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn