AP Police: ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజు వేడుకల్లో ఏపీ పోలీసులు

చిలకలూరిపేట పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్‌ డే సందర్భంగా పోలీసులు స్వయంగా కేక్‌ తీసుకెళ్లి ఘనంగా బర్త్ డేను నిర్వహించారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

New Update
AP Police: ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజు వేడుకల్లో ఏపీ పోలీసులు

Guntur: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్‌ డే వేడుకల్లో పోలీసులు హడావుడి చేశారు. స్వయంగా పోలీసులే కేక్‌ తీసుకుని పుల్లారావు ఇంటికి వెళ్లి వెంకటకుమారి బర్త్‌ డేను ఘనంగా నిర్వహించారు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త.. అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌..!

ప్రజలను సంరక్షించాల్సిన పోలీసులు ఇలా దిగజారిపోయి రాజకీయ నేతలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. చిలకలూరిపేట టౌన్‌, రూరల్‌ పీఎస్‌ సిబ్బంది, సీఐ సుబ్బనాయుడు, చిలకలూరిపేట టౌన్ ఎస్సై రమేష్, ఇతర సిబ్బంది పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు