YCP MP’s Resign: ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఇప్పుడు నేతల రాజీనామాల టెన్షన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలో 175 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 స్థానాలకు పరిమితమై ఘోర ఓటమిని చవి చూసిన వైసీపీ నుంచి కొందరు నేతలు బయటకు వస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఎన్డీయేలోని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల్లో చేరుతున్నారు. ఏది ఏమైనా జగన్ కు పార్టీ నేతలను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..BREAKING: జగన్‌కు డబుల్ షాక్.. నేడు వైసీపీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా!
AP: వైసీపీ చీఫ్ జగన్‌కు డబుల్ షాక్ తగిలింది. ఈరోజు వైసీపీకి ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయనున్నారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నారు. వచ్చే నెల 5 లేదా 6న లోకేష్ సమక్షంలో టీడీపీలో వారు చేరనున్నట్లు సమాచారం.
Translate this News: