YCP Leader: గుంటూరులో వైసీపీ నేత అరెస్ట్ అయ్యాడు. దళిత కుటుంబంపై దాడికి సంబంధించిన కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కాగా దీపావళి పండుగ రోజు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శకుంతలనగర్‌లో ఓ దళిత కుటుంబ దాడి చేసిన నరేంద్రరెడ్డి ఏ1 ఉన్నారు. అయితే నరేంద్రరెడ్డిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా.. అతను పరారీలో ఉన్నాడు. ఈరోజు ఏ1గా ఉన్న వైసీపీ నేత నరేంద్రరెడ్డి సహా మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ చెప్పారు.
ఇది కూడా చదవండి: జగన్ సంచలనం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరు బాట!
ఈ కేసు ఏంటి?...
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగ రోజు టపాసులు పేల్చే సమయంలో సోనియా కుమారుడు అవినాష్, అతని స్నేహితుడు జయదేవ్‌కు.. నరేంద్రరెడ్డి డ్రైవర్ వేంకటేష్ తో గొడవ జరిగిందని అన్నారు. ఈ క్రమంలో ఇది గమనించిన నరేంద్రరెడ్డి.. డ్రైవర్ సహా ఏడుగురు సోనియా కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తేలిందని ఎస్పీ అన్నారు. బాధితుల ఇంట్లో సీసీ కెమెరాలు, కిటికీ అద్దాలు ధ్వంసం చేసి కులంపేరుతో దూషించినట్టు నిర్ధరణ చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకొని నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నంతోపాటు రౌడీషీట్ తెరిచి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు.
ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు!
ఇటీవల మాజీ మంత్రిపై కేసు...
ఇటీవల వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆయనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద రూ. 90 లక్షలు తీసుకుని మోసం చేసి.. పలుమార్లు లైంగికంగా వేధించారని తాడేపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజుకు విజయవాడ మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా దీనిపై మెరుగు స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేశారు. కావాలనే ఇలా కొందరు చేస్తున్నారని.. ఏ టెస్టుకు అయినా తాను సిద్ధం అని అన్నారు.
ఇది కూడా చదవండి: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు