ఏపీలో అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం ఎగకంటవరంలో దారుణం జరిగింది. తేనెటీగల దాడిలో ఓ చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. చెట్ల వద్ద ఆడుకుంటున్న అన్నాచెల్లెలిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. గాయాలపాలైన వారిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చెల్లెలు వంతల గౌరి (4) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోదరుడు విశ్వకు(10)కు వైద్యులు చికిత్స చేస్తున్నారు.
Also Read: ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహం గాంధీ ఆస్పత్రికి అప్పగింత !
ఇదిలాఉండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం స్తంభంపల్లిలో కూడా తండ్రి కొడుకులపై తేనెటీగల దాడి చేశాయి. ఈ ఘటనలో తండ్రి మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్తంభంపల్లి గ్రామానికి చెందిన కందాడి లచ్చిరెడ్డి (61), కందాడి నవీన్‌రెడ్డి తండ్రికొడుకులు. వాళ్లు గరువారం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. పత్తి చేను వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ చెట్టుకు తేనెటీగ చెట్ట కొమ్మ విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు లేచాయి. సమీపంలో ఉన్న రైతులను దాడి చేశాయి.
గాయాలపాలైనవారిని వేములవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ లచ్చిరెడ్డి మృతి చెందాడు. మిగిలిన రైతులు చికిత్స తర్వాత ఇంటికి వచ్చారు. అయితే కొడుకు నవీన్ కూడా తండ్రిని కోల్పోయిన బాధతో దవాఖానా నుంచి వచ్చి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. పండుగ పూట లచ్చిరెడ్డి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.