BIG BREAKING : నలుగురు అన్యమత ఉద్యోగులపై టీటీడీ సస్పెన్షన్ వేటు

టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి. ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, బర్డ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతలను సస్పెండ్ చేసింది.

New Update
tirumala employee

tirumala employee Photograph: (tirumala employee)

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.  టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి. ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, బర్డ్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పని చేస్తున్న అసుంతలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు వారిని విధుల నుంచి తొలగిస్తూ తాజాగా టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా టీటీడీ ఈ చర్యలు చేపట్టింది.  హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని చర్యలు చేపట్టింది.


టీటీడీలో విధులు నిర్వహిస్తూ చర్చ్ లో ప్రార్థనలు

టీటీడీలో విధులు నిర్వహిస్తూ చర్చ్ లలో ప్రార్థనలు చేస్తూ ఉద్యోగుల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చర్చ్ లో ప్రార్థనలు చేస్తూ కెమెరా కంట చిక్కింది ఉద్యోగి కణిక.  వీడియో తీస్తున్నట్లుగా గుర్తించి వెంటనే ముఖంపై పైట కప్పుకుంది. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.

ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీలో 1,000 మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని ఆరోపించారు. దీనిపై తక్షణ విచారణ జరిపి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, గత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. కేవలం 22 మంది అన్యమత ఉద్యోగులను మాత్రమే గతంలో గుర్తించినట్లు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ మాత్రం ఈ సంఖ్య 1,000 కంటే ఎక్కువ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు