/rtv/media/media_files/2025/10/14/jogi-ramesh-fake-liquor-scam-2025-10-14-17-00-23.jpg)
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, YCP నేత జోగి రమేష్‌పై సిట్ టీం విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 10 పేజీల కీలక ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఆయనను 18వ నిందితుడిగా (A18) పేర్కొన్న అధికారులు, ఆయన పాత్రపై సంచలన విషయాలను వెల్లడించారు. కేవలం ఆర్థిక లాభం కోసమే కాకుండా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకే జోగి రమేష్ ఈ దందాను ప్రోత్సహించారని సిట్ ఆరోపించింది. ఏప్రిల్ 2024 తర్వాత ములకలచెరువు, ఇబ్రహీంపట్నం కేంద్రాలుగా నకిలీ మద్యం ఉత్పత్తిని ముమ్మరం చేయాలని, తద్వారా రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందనే ముద్రను ప్రభుత్వానికి అంటగట్టాలని ఆయన ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో జోగి రమేష్‌కు 2006 నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిట్ స్పష్టం చేసింది. గతంలో స్వర్ణ బార్ (ప్రస్తుతం చెర్రీ బార్) నిర్వహణలో వీరు భాగస్వాములుగా ఉండటమే కాకుండా, 2017లో ఇబ్రహీంపట్నం బార్ సిండికేట్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ఈ పాత పరిచయమే అక్రమ మద్యం తయారీకి పునాదిగా మారిందని అధికారులు వివరించారు.
ఈ అక్రమ వ్యాపారం సాఫీగా సాగేందుకు అద్దేపల్లి బ్రదర్స్ నుంచి జోగి రమేష్‌కు భారీగా డబ్బులు అందినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. నిందితులు ప్రతి రెండు మూడు నెలలకోసారి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రమేష్‌కు, ఆయన సోదరుడు జోగి రాముకు అందజేసేవారని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్‌లు, ఆర్థిక లావాదేవీలను ప్రధాన ఆధారాలుగా జోడించారు.
గోవా, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ముడి పదార్థాలు సేకరించి, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ మద్యం విక్రయించినట్లు సిట్ వెల్లడించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న జోగి బ్రదర్స్ తరపున న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Follow Us