Fake liquor manufacturing : కోడూరులో తీగ...తిరుపతిలో కదిలిన డొంక

తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ (సెబ్) అధికారులు దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారు చేస్తున్న మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా కోడూరు లో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది.

New Update
Fake liquor

Fake liquor

Fake liquor  : తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ (సెబ్) అధికారులు దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారు చేస్తున్న మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందిరమ్మ కాలనీలో ఏకకాలంలో పెద్ద ఎత్తున సెబ్‌ అధికారులు దాడులు నిర్వహించడంతో ఏం జరుగుతుందో తెలియక కలకలం రేగింది. కాగా ఇటీవల అన్నమయ్య జిల్లా కోడూరు లో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది. ఈ మద్యం ఎక్కడి నుంచి వస్తుందని పోలీసులు విచారణ చేపట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సెబ్ అధికారులు మరింత లోతుగా విచారించడంతో కొన్ని ఆసక్తి విషయాలు వెలుగు చూశాయి.

Also Read :  ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

తిరుపతి రూరల్‌ ప్రాంతంలోని దామినేడు ఇందిరమ్మ గృహాలు వద్ద గల బి బ్లాక్ 61వ నెంబర్ ఇంటిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని తేలింది. దీంతో అధికారులు ఒక్కాసారిగా దాడులు చేశారు. ఈ దాడుల్లో మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్, నకిలీ లేబుల్స్ పట్టుబడ్డాయి. కాగా వీటితో బ్రాండెడ్ తరహా మద్యం తయారు చేసి తిరుపతి, కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు ముఠా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read :  సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసులకు దొరికిన బిగ్ ప్రూఫ్


ఈ సందర్భంగా దాడుల్లో  స్పిరిట్ 23 క్యాన్లు, నకిలీ లేబుల్స్, 6955 ఖాళీ బాటిళ్ల ను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సూత్రధారులైన ఎం ఆర్ పల్లెకు చెందిన చికెన్ శ్రీను, మహేష్, అయ్యప్పలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  ప్రధాన సూత్రధారి వెంకటరమణ, జయబాబు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు