వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తనపై చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి స్పందిచారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని తెలిపారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
విజయసాయి రెడ్డి రాజీనామాపై
అంతకుముందు విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. వైసీపీ కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది అని స్పష్టం చేశారు. ప్రలోభాలకు లొంగి.. లేదంటే భయపడి.. వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని జగన్ ప్రశ్నించారు. ఐదేళ్లు తిరిగి కష్టపడితే మనకు సమయం వస్తుందని.. అందుకే విశ్వసనీయత ముఖ్యమని పదే పదే జగన్ గుర్తు చేశారు.
వైసీపీ కీలకంగా వ్యవహరించి, జగన్ కు అత్యంత సన్నిహితంగా మెదిలిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఎంపీ పదవితోపాటు.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తాను ఏ పార్టీలో కూడా చేరడం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తానంటూ వెల్లడించారు.
Vijayasai Reddy : మాజీ సీఎం జగన్కు విజయసాయిరెడ్డి కౌంటర్ !
వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తనపై చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి స్పందిచారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు.
vijayasai reddy jagan