BIG BREAKING : ఏపీలో భీకర ఎన్‌కౌంటర్‌..  ఆరుగురు మావోయిస్టుల మృతి!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

New Update
BREAKING

ఆరుగురు మావోయిస్టులు మృతి

ఈ క్రమంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందినది. మృతుల్లో కీలక నాయకులు ఉన్నారా లేదా అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని, మరికొంత మంది మావోయిస్టులు ఉన్నారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు, వారి గుర్తింపును పోలీసులు వెల్లాడించాల్సి  ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.  ఏపీ, ఛత్తీస్ గడ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదిలికపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరింత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు