Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి
రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలవనున్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబును యనమల, భువనేశ్వరి, బ్రహ్మణి కలవనున్నారు.
నిరాధారమైన ఆధారాలతో టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రపంచంలోనే రాష్ట్రాన్నికి గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైలులో పెట్టినందుకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు.
ఆ ఊరిలో ఇంటింటికీ గణనాధులు తయారు చేసే హస్త కళాకారులు ఉన్నారు. మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది ఆ గ్రామం. వినాయక చవితికి దూర ప్రాంతాలకు ఇక్కడ నుండే వినాయక మట్టి విగ్రహాలు తరలింపు అవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాజమండ్రిలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి రాజమండ్రి తిలక్ రోడ్డులోని సాయి బాబా ఆలయం దగ్గర నుంచి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ వ్యాప్తంగా ఆందోళన పరిస్థితి కొనసాగుతునే ఉంది. చంద్రబాబును విడుదల చేయాలని డిమాడ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మేము సైతం అంటూ రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు టీడీపీ పార్టీ శ్రేణులు. చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదల కావాలని గుడిలో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. 16 నెలలు జైల్లో వున్న జగన్ తన శాడిజంతో చంద్రబాబును జైలుకు పంపారని మండిపడుతున్నారు.
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తొలిసారిగా సీఎం జగన్ స్పందించారు. అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి వ్యక్తిని కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ పేర్కొన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు ఖరారు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ పొత్తుల గురించి అధికారికంగా ప్రకటించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్ దీనిపై స్పందించారు.
చంద్రబాబు తరుఫు లాయర్లు సుప్రీంకోర్టు తలుపు తడుతారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని చంద్రబాబు తరుఫు లాయర్ల క్వాష్ పిటిషన్ వేశారు. ఈ విచారణకు ఈ నెల 19కు హైకోర్టు వాయిదా వేసింది. తర్వాతి స్టెప్ ఏం తీసుకోవాలన్నదానిపై టీడీపీ లీగల్ టీమ్ మంతనాలు జరుపుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణంలో బంగారు నగల వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగల వ్యాపారి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు దుండగులు. అంతేకాకుండా వారిని విచక్షణారహితంగా కొట్టారు. కేజీపైగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.