Lokesh: మా నాన్ననే టచ్ చేస్తావా? జగన్‌పై లోకేశ్ ఫైర్!
కొంత మంది పోలీసు అధికారుల వల్లన వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని విమర్శలు గుప్పించారు నారా లోకేశ్. పోలీస్ సోదరులు దయచేసి ఆలోచించాలన్నారు. పోలీసులను అడ్డుపెట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తన తండ్రి చంద్రబాబు అరెస్టు విషయంలో సీఎం జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు లోకేశ్. దొంగ కేసులు పెట్టి జైలుకు తరలించారన్నారు. చంద్రబాబు అరెస్టును ప్రజలంతా ఖండించారని.. బంద్‌ని జయప్రదం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు లోకేశ్. ఇలాంటి సమయంలో తమకు సపోర్ట్ ఇచ్చినందకు పవన్‌కు, సీపీఐ, ఎంఆర్‌పిఎస్‌కు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.