Kodi Pandalu : జోరుగా కోడిపందాలు..కోట్లల్లో బెట్టింగులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు కోట్లల్లో బెట్టింగులు కడుతున్నారు. మరోవైపు పందాలను కూడడానికి భారీగా జనం తరలివస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు కోట్లల్లో బెట్టింగులు కడుతున్నారు. మరోవైపు పందాలను కూడడానికి భారీగా జనం తరలివస్తున్నారు.
అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. ఏలూరు జిల్లా రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు అల్లుడు లోకేష్ సాయికి అపురూపమైన రీతిలో మర్యాదలు చేసారు. 225 రకాల వంటకాల చేసి కమ్మని కనువిందు ఏర్పాటు చేశారు.
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈరోజు విడుదల కావడంతో మహేష్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందనే చెప్పాలి. అమలాపురంలో శ్రీకృష్ణుడు రూపంలో మహేష్ బాబు ఫోటో పెట్టి దేవుడికి కొబ్బరికాయలు కొట్టండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సీఎం జగన్ తనకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని.. అందుకే ఏ పార్టీలో చేరడం లేదని అన్నారు. తనతో ఉన్నవాళ్లే తనపై జగన్ కు తప్పుడు సంకేతాలు పంపారని మండిపడ్డారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. మరో 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. సికింద్రాబాద్-నరసాపూర్, నరసాపూర్-హైదరాబాద్, హైదరాబాద్-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-హైదరాబాద్ మార్గాల్లో ఈ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవీ నరసాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. గోకరాజు రంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కుమారుడు కూడా వైసీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు ఇవ్వొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. జగన్ షర్మిల ఒక్కటేనన్నారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని కామెంట్స్ చేశారు. ఆమె కంటే సమర్థులైన నాయకులు ఏపీలో లేరా అని ప్రశ్నించారు.
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి మరో మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్. నాందేడ్ నుంచి కాకినాడ టౌన్ కి మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.