Pithapuram Floods: పిఠాపురాన్ని ముంచెత్తుతున్న వరదలు

భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.

author-image
By V.J Reddy
Pithapuram Floods
New Update

Pithapuram Floods: పిఠాపురాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఓ వైపు ఏలేరు వాగు ఉధృతి.. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలతో పిఠాపురం అతలాకుతలం అయింది. వరద ముంపులో చాలా గ్రామాలు ఉన్నట్లు సమాచారం. పిఠాపురం రూరల్ మండలం కాశివారిపాకలు గ్రామంలోకి అర్ధరాత్రి ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఆరా...

రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పిఠాపురంలో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీస్తున్నారు. నిన్న వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు.

కాగా ఇప్పటికే వరదతో విజయవాడ నగరంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. కాగా తన సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వరద బాధితులకు అన్ని సౌకర్యాలు, ఆహార కొరత లేకుండా చూడాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

#pawan-kalyan #pithapuram #heavy-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe