ఇన్‌స్టాగ్రామ్ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న వివాహిత.. ఏమైందో తెలుసా

ఇన్‌స్టా మాయలో పడి వివాహిత ప్రాణాలు తీసుకుంది. ఉమాదేవికి ఇన్‌స్టాలో అశోక్‌ అనే వ్యక్తితో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అశోక్ ఆమెకు మాయమాటలు చెప్పి రూ.4 లక్షలు, 25 కాసుల బంగారం తీసుకొని మోసం చేశాడు. విషయం భర్తకు తెలియడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

New Update
insta

East Godavari district crime

East Godavari district : ఈ మధ్య సోషల్ మీడియా మోసాలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియక సోషల్ మీడియా మోసాలకు బలై ప్రాణాలు తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి సంఘటనే తూర్పు గోదావరి జిల్లాలో  చోటుచేసుకుంది. ఇన్‌స్టా గ్రామ్‌ మోజులో పడి ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. రాజానగరానికి చెందిన ఉమాదేవికి ఇన్‌స్టాలో విశాఖకు చెందిన అశోక్‌ అనే వ్యక్తితో ఏడాది క్రితం నుంచి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అశోక్ ఉమాదేవికి నువ్వంటే ఇష్టం, నువ్వు లేకపోతే బతకలేను అంటూ మాయ మాటలు చెప్పాడు. ప్రేమ పేరుతో  ఆమెను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి.. నమ్మించి.. ఆమె దగ్గర నుంచి  రూ.4 లక్షల నగదు, 25 కాసుల బంగారం తీసుకున్నాడు. ఆ తర్వాత తిరిగి ఇవ్వకుండా ఉమాదేవిని బాగా  ఇబ్బంది పెట్టాడు. 

Also Read:Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

 ఉరివేసుకుని ఆత్మహత్య

కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఉమాదేవి భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఉమాదేవిని ఆమె భర్త బంగారం తీసుకురావాలంటూ పుట్టింటికి పంపాడు.దీంతో మోసాన్ని తట్టుకోలేక మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియా మోజులో  పడి ఏం చేస్తున్నారో.. వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఉన్నారు. కొంత మంది అయితే ఇన్స్టా గ్రామ్ లో ఫేమ్, లైకులు కోసం ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వంటి వాటికి బలై.. అప్పులు తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. 

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

Also Read: ఫెమినా మిస్‌ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే

Also Read: బర్త్‌ డే కి దుబాయ్ తీసుకెళ్ల లేదని భర్త పై పిడిగుద్దులు కురిపించిన భార్య..భర్త మృతి!

Advertisment
తాజా కథనాలు