/rtv/media/media_files/2025/10/22/bhimavaram-dsp-jayasuriya-issue-2025-10-22-15-15-52.jpeg)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాల్లో పేకాట కల్చర్ పెరిగిపోయిందని భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. గోదావరి జిల్లాలో పేకాట ఆడటం సహజమని ఆయన అన్నారు. అయినా కూటమి ప్రభుత్వం పేకటపై ఉక్కుపాదం మోపిందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. భీమవరం డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఎవరో పవన్ కళ్యాణ్‌కు ఆయన గురించి చెడుగా చెప్పారని డిప్యూటీ స్పీకర్ RRR అన్నారు.
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. ఈ విషయంపై డిప్యూటీ స్పీకర్ స్పందించారు.
Follow Us