Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సర్పంచ్ సంఘాలతో పవన్ సమావేశం కాగా. . వాలంటీర్ల వ్యవస్థపై ఆయన తాజాగా స్పందించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై.. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందనని చెప్పారు.
Also Read: ''హ్యాపీ బర్త్ డే అప్పా''.. కమల్ కోసం శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్!
గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని.. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు.
Also Read: Anil Ambani: అనిల్ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్!
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈసీ వారిని విధులకు దూరంగా ఉంచింది. పింఛన్ల పంపిణీ బాధ్యతల్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు.. వాలంటీర్ల దగ్గర ఉన్న మొబైల్స్ కూడా వెనక్కు తీసుకున్నారు.
Also Read: ట్రంప్ రాకతో సీన్ రివర్స్.. పశ్చిమాసియాలో మారిన యుద్ధ వాతావరణం!
నెలకు రూ.10వేలకు..
ఈ పరిణామాల మధ్య కొంతమంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.. కొంతమంది మూకుమ్మడిగా ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు. వాలంటీర్ల అంశం ఎన్నికల సమయంలో పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది.. కూటమి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తుందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అయితే దానికి బదులుగా తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతందని కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి వారి జీతాన్ని నెలకు రూ.10వేలకు పెంచుతామని కూడా ప్రకటించింది.

Also Read: Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది?
ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా, లేదా అనే చర్చ మొదలైంది. చాలా సందర్భాల్లో చంద్రబాబు, మంత్రులు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. కానీ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అయితే కొందరు వాలంటీర్లు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపణలు చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రుల్ని కలిసి రిక్వెస్ట్ చేశారు.