BREAKING: చిక్కుల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే! AP: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇంటిని కోమటిలంక, శ్రీపర్రు గ్రామాల ప్రజలు ముట్టడించారు. గత ప్రభుత్వ హయాంలో తమ చేపల చెరువులకు లీజు చెల్లించకుండా అబ్బయ్య చౌదరి దోచుకున్నారని ఆందోళనకు దిగారు. By V.J Reddy 08 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Abbaya Chowdary: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇంటిని కోమటిలంక, శ్రీపర్రు గ్రామాల ప్రజలు ముట్టడించారు. గత ప్రభుత్వ హయాంలో తమ చేపల చెరువులకు లీజు చెల్లించకుండా అబ్బయ్య చౌదరి దోచుకున్నారని ఆందోళనకు దిగారు. ఐదేళ్ల లీజు డబ్బులు వెంటనే చెల్లించాలంటూ రెండు రోజులుగా వారు ఆందోళన చేస్తున్నారు. కాగా మొన్న కోమటిలంక గ్రామస్థులు నిరసన చేయగా..నిన్న శ్రీపర్రు గ్రామస్థులు ఆయన ఇంటి ముందే వంటావార్పు జరిపారు. ఇది కూడా చదవండి: BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఫోన్ సీజ్! 230 ఎకరాల్లో చెరువులు... గత టీడీపీ పాలనలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కోమటిలంక, శ్రీపర్రు గ్రామాలకు కోమటిలంకలో దాదాపు రూ.2.5 కోట్ల సొంత డబ్బుతో 230 ఎకరాల్లో చెరువులు తవ్వించారు. ఆ చెరువులను లీజుకు ఇస్తే వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే మీరే సాగు చేసుకుని.. మాకు లీజు చెల్లించాలని గ్రామస్థులు అడగడంతో చింతమనేని అందుకు ఒప్పుకున్నారు. ఇది కూడా చదవండి: రేషన్ మాఫియాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. క్లారిటీ! కాగా అదే సమయంలో 2019 ఎన్నికలు వచ్చాయి. టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారం చేపట్టింది. అయితే అక్కడ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ‘చెరువులు నేనే సాగు చేస్తాను.. ఇచ్చింది తీసుకుని సైలెంట్ గా ఉండాలి. లేదంటే చెరువులే లేకుండా చేస్తా’ అంటూ గ్రామస్థులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎకరానికి రూ.80 వేలు వచ్చే చెరువులకు రూ.20 వేలు ఇస్తానంటూ తమను బలవంతంగా ఒప్పించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. వాటిని ఆక్వా వ్యాపారులకు ఎకరం రూ.80 వేల చొప్పున సబ్‌లీజుకు ఇచ్చి ఈ ఐదేళ్లలో రూ.కోట్లు పోగేసుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాగా తమ డబ్బులు తమకు ఇచ్చే వరకు దీనిపై పోరాటం ఆపమని గ్రామస్థులు స్పష్టం చేశారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి