వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. జగన్ తమ్ముడు మృతి

వైస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. రేపే అంత్యక్రియలు.

author-image
By K Mohan
New Update
YS family

YS family Photograph: (YS family)

వైస్ జగన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందారు.

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. జగన్ తోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్​ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్​ అభిషేక్‌రెడ్డి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు