సైబర్ స్కాం.. పోలీస్ స్టేషన్ చూపించి కోట్లు కోట్టేశారు!

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమీన్ హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ సైబర్ కేటుగాళ్ల వలలో పడిపోయాడు. మీ పేరుతో డ్రగ్స్ కేసు నమోదైందని పోలీసు అధికారి ఫొటోతో ఒక ఫోన్ వచ్చింది. ఆపై డూప్లికేట్ పోలీస్ స్టేషన్ చూపించి రూ.2 కోట్లు కొట్టేశారు.

cyber criminals robbed
New Update

రోజు రోజుకు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సంపన్నులనే టార్గెట్ చేసి మాటువేసి ప్లాన్ ప్రకారం కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. మీ ఇంట్లో నల్లధనం ఉందనో, లేదా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు కేసులు నమోదయ్యాయని చెప్పి భయపెడుతున్నారు. ఏకంగా వాట్సాప్ వీడియో కాల్ లోనే బెదిరిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటూ కంగారు పెట్టించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారు. అయితే ఇందులో ఎక్కువగా డాక్టర్లు, లాయర్లు, బిజినెస్ మ్యాన్లే టార్గెట్ అవుతున్నారు. 

రూ.2 కోట్లు కొట్టేశారు

తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమీన్ హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్కు పోలీసు అధికారి ఫొటోతో ఒక ఫోన్ వచ్చింది. అయితే ఇది మొన్న నిన్న వచ్చిన ఫోన్ కాల్ కాదు. ఏకంగా 5 నెలల క్రితం వచ్చింది. మీ పేరుతో లండన్ నుంచి ఒక డ్రగ్స్ పార్సిల్ వస్తోందని.. దానిపై కేసు నమోదు చేశామని.. త్వరలోనే మిమ్మల్ని అరెస్టు చేస్తామని భయపెట్టారు. అంతేకాకుండా మరింత మసాలా వేస్తూ డ్రగ్స్ మాఫియా వారు మిమ్మల్ని చంపడానికి ప్లాన్ వేసినట్లు తమ విచారణలో తేలిందని ఆ డాక్టర్ ను మరింత బెదిరించారు. 

ఇది కూడా చదవండిః ఏపీలో దారుణం.. ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి..

దీంతో హడలిపోయిన ఇంతియాజ్ కేసు నుంచి పయటపడే మార్గాన్ని అడిగాడు. దీంతో కొంత డబ్బు చెల్లిస్తే సెటిల్ చేసేయొచ్చని అవతలి వ్యక్తి అన్నాడు. ఆపై వరుసగా వాట్సాప్ వీడియో కాల్ లో డూప్లికేట్ పోలీస్ స్టేషన్ చూపించి నమ్మించారు. అయితే ఇదంతా నిజమేనని నమ్మిన డాక్టర్ వారిచ్చిన అకౌంట్లకు 25 ట్రాన్సఫర్లతో మొత్తం రూ.2 కోట్లు పంపించాడు. 

ఎలా దొరికాడు

ఇటీవలే అస్సాంలో కొందరు సైబర్ కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. దీంతో ఆ కేటుగాడి బ్యాంక్ అకౌంట్ లను చెక్ చేయడంతో ఇంతియాజ్ పేరుతో భారీ మొత్తాన్ని గుర్తించారు. పోలీసులు వెంటనే ఇంతియాజ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో ఇదంతా కేటుగాళ్ల పని అని తెలిసి ఆ డాక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందువల్ల ఇలాంటి కాల్స్ వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు చెప్తున్నారు.

#cybercrime #cyber-criminals
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe