CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మారిటైమ్ పాలసీ -2024 లక్ష్యాలపై అధికారులతో సియం సమీక్షించారు.
సీఎం ఆదేశాలు....
1.హబ్, స్పోక్ మోడల్‌ను స్వీకరించడం ద్వారా హై కెపాసిటీ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టడం.
2. పోర్ట్ ప్రాక్సిమల్ ప్రాంతాలు పరిశ్రమలు, R&B, టూరిజం శాఖతో అనుసంధానించడం.
3.భవిష్యత్తు అభివృద్ధి కోసం రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లను లింక్ చేయడం.
4. మౌలిక వసతుల కల్పన కోసం ప్రజలను భాగస్వాములను చేయడం.
5.ఫిషింగ్ హార్బర్‌లు, పోర్ట్‌ల అభివృద్ధి కోసం P4 మోడల్‌ను ప్రోత్సహించడం.
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
6. గ్లోబల్ స్థాయి సంస్థలు రాష్ట్రంలో నౌకానిర్మాణం, ఓడల మరమ్మతుల పరిశ్రమలు నెలకొల్పేలా ఆకర్షించడం.
7. ఆర్‌ఓ-ఆర్‌ఓ, ఆర్‌ఓ-పాక్స్ సేవలతో సహా అంతర్గత జలమార్గాల కోసం హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేయడం.
8. సముద్ర రంగంలో పర్యాటకం, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ఏకీకృతం చేయడం.
9. ఏపీలో మారిటైమ్ యూనివర్సిటీ స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పరిశోధన అంశాలలో తోడ్పాటు కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (IMU), CEMS, IITలను భాగస్వాములుగా చేసుకోవడం.
10. ఈ రంగంలో సంస్కరణల ద్వారా ఆర్బిట్రేషన్, డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం కోసం ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టడం.
ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం- కేటీఆర్
ఇది కూడా చదవండి: మూసీ నిర్వాసితులకు రేవంత్ సర్కార్ భరోసా