AP Liquor: మందుబాబులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. ఈరోజు నుంచి నాణ్యమైన మద్యాన్ని కేవలం రూ.99లకే అందించనుంది. ఇప్పటికే 10వేల కు కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21 నాటికి మరో 20వేల కేసులు చేరుతుందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిళ్లను ఐదు ప్రముఖ సంస్థకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఈ నెలాఖరు లోగా అన్ని మద్యం దుకాణాల్లో స్టాక్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా తమకు రూ.99కే వైన్స్ యాజమాన్యాలు మందు ఇవ్వడంలేదని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: కేటీఆర్ పరువు నష్టం కేసు వాయిదా
చంద్రబాబు మాట తప్పారంటూ...
ఏపీలో ఈ నెల 16 నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కాగా సీఎం చంద్రబాబుపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాజినికి దీనికి ప్రధాన కారణం.. ఎన్నికల సమయంలో నాణ్యమైన మధ్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి సీఎం అయ్యిన చంద్రబాబు మద్యం ధరలు ఎక్కడ తగ్గించలేదని వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎలాంటి రేట్లు ఉన్నాయో అలాంటి రేట్లు తోనే మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం మమల్ని మోసం చేసిందని మందు బాబులు ఫైర్ అవుతున్నారు. కాగా కేవలం రూ.99కే నాణ్యమైన క్వార్టర్ అందిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!
పాత స్టాక్ అంటూ...
కాగా పాత ధరలే ఉండడంపై మద్యం షాపు యజమానులను ప్రశ్నించగా.. పాత ధరల ప్రకారమే స్టాక్ వచ్చిందని చెబుతున్నారు. గోదాముల్లో భారీగా పాత స్టాక్ మిగిలిపోవడంతోనే ఎక్సైజ్ శాఖ అధికారులు అవే సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. పాత రేట్లకే మద్యం విక్రయాలు క్వార్టరుకు(180ml) రూ.150,బీరు రూ.200లకు అమ్ముతున్నారు. పాత ధరలకే మద్యం అమ్ముతున్న క్రమంలో మద్యం ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!