Chandra Babu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు సాయంత్రం 6:20కి తిరుమలకు చేరుకుంటారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు చేరుకుంటారు.
తర్వాత శ్రీవారి ఆలయంలో గడపనున్నారు. అలాగే 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లను చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. శనివారం ఉదయం 7.35కి 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళామాత వంటశాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. తర్వాత విజయవాడకు చేరుకుంటారు.
సీఎం పర్యటన వివరాలు..
- రేపు సాయంత్రం 6:20కి తిరుమలకు చంద్రబాబు
* రాత్రి 7:55కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలతో ఊరేగింపు.
* ఊరేగింపుగా స్వామి వారి ఆలయానికి చేరుకోనున్న చంద్రబాబు దంపతులు
* రాత్రి 7:55 నుంచి 9:15 వరకు శ్రీవారి ఆలయంలోనే ఉండనున్న చంద్రబాబు
* 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లును ఆవిష్కరించబోతున్నారు.
* ఎల్లుండి ఉదయం 7.35కి వకుళామాత వంటశాలను ప్రారంభిస్తారు.
* ఉదయం 7:55కి చంద్రబాబు తిరుమల పర్యటన ముగుస్తుంది.
* తిరుమల నుంచి రేణిగుంటకు.. అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు.
Also Read : సారీ చెప్పినా తగ్గేదేలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున