వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యాలు చేశారు. జగన్, షర్మిల ఆస్తి వివాదం గురించి చంద్రబాబు మాట్లాడుతూ... 2004లో వందల కోట్లుగా ఉన్న సంపాదన 2024లో లక్షల కోట్లకు ఎలా చేరుకుందని.. సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కనీస విలువలు పాటించని ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేయాలంటే తనకు సిగ్గుగా ఉందని చంద్రబాబు అన్నారు.
Also Read: 4.5 కిలోల గోల్డ్..కోట్లలో..ప్రియాంక ఆస్తుల వివరాలివే!
తల్లి, సోదరిని కోర్టుకీడ్చిన జగన్.. ఇకనైనా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. "విలువలు లేని మనుషులు సమాజానికి చేటు. ప్రభుత్వంలో ఉండగా పేదలకు ఎప్పుడైనా సాయం చేశారా. ఇప్పుడేమో వైసీపీ తరఫున రూ.10 లక్షలు ఇస్తామంటున్నారు. జగన్ దగ్గర ఉన్న అవినీతి సొమ్ము అలాగైనా పేదలకు చేరుతుంది. ప్రతిపక్షంలో ఉండగా.. నన్ను 5 ఏళ్లపాటు ఇంటి నుంచి బయటకు రానివ్వలేదు. ఇప్పుడు వారిని ఆపాలంటే నిమిషం కాదు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీద కుదరదు" అని బాబు స్పష్టం చేశారు.
ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి రైల్వే ప్రాజెక్టులు ప్రకటిస్తుంటే.. ఈరోజు జాతీయ రహదారులపైనా రివ్యూ చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. రణస్థలం నుంచి శ్రీకాకుళాన్ని నాలుగు నుంచి 6 లైన్ల రహదారిగా చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఆర్ అండ్‌బీసీఎల్‌ఆర్, సీసీఎల్‌ఏ , అటవీ ఇతర శాఖలతో ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో అన్ని రంగాలు బూస్టప్ అవుతున్నాయని అన్నారు.
9987కిలోమీటర్ల జాతీయ రహదారులు ఏపీలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫోర్ లైన్‌వి ఎక్కువగా ఉన్నాయని సిక్స్ లైన్ రహదారులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇకపై వీలయినంత వరకూ కోల్‌కతా నుంచి ఇచ్చాపురం వరకూ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. నరసన్నపేట నుంచి రణస్థలం వరకు ఆరు లైన్ల రహదారి ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు రణస్థలం నుంచి శ్రీకాకుళానికి 6 లైన్లకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. కొన్నిరోడ్లను చాలా కారణాలతో నిలిపివేసిందని అన్నారు. ఫారెస్టు క్లియరెన్స్‌తోపాటు వేర్వేరు ప్రాజెక్టుల కింద 17 రహదారులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. జగన్ ప్రభుత్వంలో కేవలం 2 రహదారులు మాత్రమే పూర్తిచేసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Also Read: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా
ఇప్పడు రాష్ట్రంలో 95 ప్రాజెక్టులకు చాలా సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని 3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్లు, రాష్ట్రప్రభుత్వ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అధికారులు కీలక విషయాలను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రూ. 18000 కోట్లతో పనులన్నీ పూర్తిచేయాలని కోరామని అన్నారు. ఈ పనులు త్వరగా పూర్తవుతాయని తెలిపారు.
Also Read: దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో..
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు అనుసంధానం చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవేను ఏర్పాటు చేయాలని అన్నారు. ఏపీలో చాలా పోర్టులు ఉండటంతో రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. నేషనల్ హైవే కనెక్టివిటీతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తయరవుతుందని తెలిపారు. రూ. 70వేల కోట్ల పనులు రైల్వే శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడి పనులు అక్కడే ఆపేశారని మండిపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా కూటమి ప్రభుత్వంలో మార్చామని అన్నారు. పరిటాల దగ్గర మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Also Read: జానీ మాస్టర్ కు బెయిలొచ్చింది, 'పుష్ప2' షూట్ లో జాయిన్ అవుతారా?
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 14శాతం నుంచి 8శాతానికి లాజిస్టిక్ కాస్ట్ తగ్గాలని అన్నారు. ఏపీలో ఉచితంగా ఇసుక ఇస్తుండటంతో నిర్మాణాల్లో వేగం పుంజుకుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు.
తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు...
‘‘నిర్మాణ కంపెనీలు వాళ్లే నదిలోకి వెళ్లి తవ్వుకునే అవకాశం కల్పిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం మరిచిపోయింది. జగన్ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. అమరావతి నుంచి అనంతపూర్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చేశారు. నిజానికి స్ట్రైయిట్ రోడ్డు చేయాలని అనుకున్నామని అయితే జగన్ ప్రభుత్వంలో మార్చారు. అయితే దానినే ఇప్పుడు వాడుకుంటాం తప్ప విధ్వంసం తమ అభిమతం కాదు. ఈసారి జలాశయాలు చివరకు గండికోట, బ్రహ్మసాగర్ , పులిచింతలలో నీరు నిండుగా ఉంది. ఏపీ అంటే కరవు, తుఫాను. రాయలసీమ అంటే నీళ్లులేవు, రాళ్లసీమ అంటారు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఏపీకి బులెట్ ట్రైన్ వస్తే నాలుగు నగరాలకు ఉపయోగంగా ఉంటుంది. 4కోట్ల జనాభాతో గంటన్నర, రెండు గంటల్లోనే తదితర ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు. అప్పుడు విమానం, రైల్లో వెళ్లడానికి ఒక్కటే సమయం అవుతుంది’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.