వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు సర్కార్ కొత్త స్కెచ్.. మరి కోర్టులు ఒప్పుకుంటాయా?

మున్సిపల్ చట్టానికి సవరణలు తీసుకువచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎన్నికైన 4 ఏళ్ల తర్వాత మాత్రమే వారిపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ గడువును రెండున్నరేళ్లకు తగ్గించేలా మార్పులు తేనున్నారు.

jagan,
New Update

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి.. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. అయితే.. 2021లో నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో 99 శాతం మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. 100 శాతం కార్పోరేషన్లపై జెండా ఎగురవేసింది. 75 మున్సిపాలిటీలకు గానూ ఒక్క తాడిపత్రి మినహా అన్నింటిలోనూ నాటి అధికార వైసీపీనే ఛైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. 12 కార్పొరేషన్లలో వైసీపీ అభ్యర్థలే మేయర్ పదవిని చేపట్టారు. అయితే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కు ఈ అంశం పంటి కింద రాయిలా మారింది. దాదాపు అన్ని చోట్ల వైసీపీ పాలకవర్గాలదే పెత్తానం ఉండడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. ఇటీవల కడప లాంటి చోట్ల వివాదాలు సైతం తలెత్తిన విషయం తెలిసిందే. అనేక చోట్ల కౌన్సిలర్లు, కార్పోరేటర్లు కూటమిలోని పార్టీల్లో చేరుతున్నా.. మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం పెట్టలేని పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి: మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. కేవలం రూ.2 లక్షలకే..

పురపాలక చట్టం ప్రకారం పాలకవర్గాలు ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యే వరకు అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం లేదు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. మేయర్, పురపాలక ఛైర్మన్ల పదవీకాలం రెండున్నరేళ్లు ముగిసిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టేలా చట్టనికి సవరణ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రోజు అమరావతిలో జరగనున్న కేబినెట్ మీటింగ్ లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్ట సవరణలకు ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. 
ఇది కూడా చదవండి: ఏపీలో ఉద్రిక్తత.. అదానీ క్యాంపుపై ఎమ్మెల్యే వర్గీయుల రాళ్ల దాడి!

వైసీపీకి బిగ్ షాక్..

రాష్ట్రంలో అధికారంలో లేకున్నా.. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో వైసీపీ హవానే ఇంకా కొనసాగుతోంది. అయితే.. కూటమి సర్కార్ తీసుకువస్తున్న ఈ చట్ట సవరణ అమల్లోకి వస్తే మెజార్టీ మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు పెట్టే అవకాశం ఉంది. దీంతో అవన్నీ కూటమి ఖాతాల్లోకే వెళ్లే అవకాశం ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మెజార్టీ చోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కోర్టులో నిలుస్తుందా?

ఈ చట్ట సవరణ కోర్టుల ముందు నిలుస్తుందా? లేదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఉన్న మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరూ పాత పురపాలక చట్టం ప్రకారం ఎన్నికైన వారే. వీరు ఇప్పుడు పదవిలో ఉండగానే.. ఆ చట్టానికి ఇలా వివాదాస్పద మార్పులు తీసుకువస్తే అది చెల్లదన్న చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చే ఈ చట్ట సవరణపై వైసీపీ తప్పనిసరిగా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.   

#chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe