ఏపీలో రెండు కొత్త విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రోజు ప్రారంభించారు. విశాఖపట్నం, విజయవాడ మధ్య ఒకేసారి రెండు విమాన సర్వీసులను స్టార్ట్ చేశారు. ఎయిర్ ఇండియా సర్వీసు విమానం ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుతుంది. మళ్లీ రాత్రి 7:55 గంటలకు గన్నవరంలో బయలుదేరి తిరిగి 9 గంటలకు విశాఖ చేరుతుంది.
ఇది కూడా చూడండి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త!
విశాఖ, విజయవాడ మధ్య..
ఇండిగో సర్వీసు రాత్రి 7:15 గంటలకు గన్నవరంలో బయలు దేరి 8:20కి విశాఖ చేరుతుంది. తిరిగి మళ్లీ అదే సర్వీసు రాత్రి 8:45కి విశాఖలో బయలుదేరి 9:50కి గన్నవరం చేరుకుంటుంది. ఇప్పటి వరకు కేవలం ఒక సర్వీసు మాత్రమే విశాఖ, విజయవాడ మధ్య ఉన్నాయి. దీంతో మొత్తం మూడు విమాన సర్వీసులు అయ్యాయి.
ఇది కూడా చూడండి: యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఒకేసారి రెండు నగరాల మధ్య సర్వీసులు ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. ఇలా ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తే టికెట్ రేటు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరమని.. దీనిని ఇంకా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని తెలిపారు.
ఇది కూడా చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
విశాఖ-గోవా మధ్య కూడా త్వరలో విమాన సర్వీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. విశాఖ నుంచి మిగతా ప్రాంతాలకు కనెక్టివిటీలు ఎక్కువగా ఉండేలా కృషి చేస్తానని తెలిపారు. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్నామని, ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇది కూడా చూడండి: పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు