Guntur : మంటకలిసిన మానవత్వం.. ప్రాణం పోతున్న పట్టించుకోలే.. ఏం మనుషులురా!

కళ్ల ముందు మనిషి ప్రాణం పోతున్నా, ప్రాణాల కోసం మనిషి విలవిల్లాడుతుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప.. సహయం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు..ఇలాంటి జనాన్ని చూసి నేటి సమాజం కచ్చితంగా తలదించుకోవాల్సిందే.

New Update
video

కళ్ల ముందు మనిషి ప్రాణం పోతున్నా, ప్రాణాల కోసం మనిషి విలవిల్లాడుతుంటే చూస్తూ ఉండిపోయారు తప్ప.. సహయం చేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు..ఇలాంటి జనాన్ని చూసి నేటి సమాజం కచ్చితంగా తలదించుకోవాల్సిందే. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, కురగల్లులో లారీ ఢీకొట్టి తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న బైకర్‌కు సహాయం చేయకుండా చుట్టూ చేరి, నిస్సత్తువగా చూస్తూ నిలబడ్డ ప్రజల దృశ్యాలు చూస్తే మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అనే పాటను గుర్తు చేస్తున్నాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో, మానవత్వం మంటగలిసిపోతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.

వైరల్ అవుతున్న 31 సెకన్ల వీడియోలో బైకర్.. ఓవర్ టేక్ చేస్తూ లారీ వెనుక టైర్ల కింద పడి, ఘటనా స్థలంలోనే విలవిలలాడుతూ చనిపోవడం కనబడుతోంది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నా చూస్తూ ఉన్నారే కానీ ఎవరూ సహాయం చేయడానికి లేదంటే 108 సేవలకు కాల్ చేయడానికి ముందుకు రాలేదు. 

ఎందుకంటే ఇది భారతదేశం

పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ వీడియో సోషల్ మీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.. ఎవరూ పట్టించుకోరు, ఎవరూ బాధ్యత తీసుకోరు. ఎందుకంటే ఇది భారతదేశం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు చనిపోయిన శరీరం, మిగతా అందరూ నడిచే శవాలు మరో నెటిజన్ ఫైరయ్యాడు.  

Advertisment
తాజా కథనాలు