Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు!

తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్‌ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం మెయిల్‌ లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఫ్లైట్‌ జర్నీ చేసేవారికి గుడ్‌ న్యూస్‌..శంషాబాద్‌ నుంచి మరో 4 విమానాలు!
New Update

Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్‌ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం మెయిల్‌ లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు.

Also Read: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దీపావళి శుభవార్త!

తమిళనాడులో ఉగ్రవాది జాఫర్‌ సాదిక్‌ కు జైలు శిక్ష పడింది.  ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరుఫున తమిళనాడు సీఎం స్టాలిన్‌ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని స్కూళ్లలో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకొంది. అని మెయిల్‌ లో పేర్కొన్నారు. 

అందులో భాగంగా తిరుపతిలోని నాలుగు ప్రైవేట్‌ హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: దీపావళి పండుగ వేళ 7 వేల స్పెషల్ ట్రైన్స్

విమానానికి కూడా..

తిరుపతి విమానాశ్రయంలో స్టార్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఎస్‌ 5-154 విమనానికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. ఆదమ్‌ లాన్‌ జా 33 3 పేరుతో ఉన్న ఎక్స్‌ ఖాతా నుంచి బెదిరింపు సందేశాన్ని పంపారు. దీని పై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రస్తుతం విమాన ప్రయాణాలు చేయాలంటే వణుకుతున్నారు. గత ఆరు రోజుల్లో మొత్తం 70 బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం దేశీయ విమానాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వస్తాన్నాయి. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా భయపడుతున్నారు. ఇటీవల లండన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంతో పాటు పలు ఎయిర్ లైన్స్‌కు కూడా వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. 

వరుస బాంబు బెదిరింపులు..

శనివారం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలు దేరిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీ చేశారు. రెండు గంటలు పాటు విమానాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానస్పదమైన వస్తువలు దొరకలేదని అధికారులు తెలిపారు. అయితే గత పది రోజుల నుంచి బాంబు బెదిరింపుల కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకి బయలు దేరిన ఆకాశ ఎయిర్‌ లైన్స్‌కి అక్టోబర్ 16వ తేదీన బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Also Read: ఏపీపై దానా తుపాన్‌ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న మరో ఎయిర్‌ లైన్స్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. అలాగే ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియాకి కూడా అక్టోబర్ 15వ తేదీన బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని కెనడాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి అధికారులు తనిఖీ చేశారు. కానీ ఎలాంటి అనుమాస్పద వస్తువులు కనిపించలేదు. ఇలానే ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న విమానానికి కూడా బెదిరింపులు రాగా దాని అహ్మదాబాద్‌కు మళ్లించారు. 

Also Read: దీపావళి బోనస్.. నేడు అకౌంట్లో డబ్బు జమ!

ఇలా బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని పట్టుకుని తప్పకుండా శిక్షిస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీరిని పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు సైబర్ సెల్, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్‌తో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇలా బెదిరింపులు వచ్చిన ప్రతీసారి విమాన సంస్థలకు కోట్లలో నష్టం ఉంటుదట. విమానాన్ని ఆపడం, ఆలస్యం కావడం, బాంబ్ స్కాడ్‌ను రప్పించి చెక్ చేయడం, మళ్లీ ప్రయాణించాలంటే చాలా సమయం పడుతుంది. దీనివల్ల కనీసంలో రూ.3 కోట్లు అయిన విమాన సంస్థలకు నష్టం వస్తుందట. గత వారం రోజుల నుంచి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నిన్న ఒక్క రోజు పది వరకు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 

 

#tirupati #bomb-threat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe