/rtv/media/media_files/2025/02/05/1zXXVN5CTYpkPupRQjIH.jpg)
Mehndi for pregnant women
Mehndi: పండుగలు లేదా వేడుకలకు మహిళలు మెహందీ పెట్టుకుంటారు. అమ్మాయిల అందాన్ని పెంచే అలంకారాల్లో ఇది ఒకటి. కానీ ఇది చేతుల అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే గర్భిణులు మెహందీ పెట్టుకోకూడదని కొందరు చెబుతున్నారు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ప్రచారాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో మెహెందీ లేదా హెన్నా పెట్టుకోవడం వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డపై ప్రభావం పడుతుందని అంటున్నారు. మహందీపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
చర్మం బయటి పొరకు రంగు:
కొందరు ఫోటోల కోసం కడుపుపై గోరింటాకు పెట్టుకోవడం ఈ తరహా వార్తలు ప్రచారం కావడానికి కారణం అయ్యాయి. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకుంటే శిశువుపై ప్రభావం చూపుతుందని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు, గైనకాలజిస్టులు ఇది నిజం కాదంటున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారం లేదని చెబుతున్నారు. హెన్నా ఒక సహజ రంగు. ఇది చర్మం బయటి పొరకు మాత్రమే రంగు తెస్తుంది. ఇది శరీరం లోపలికి వెళ్లదంటున్నారు.
ఇది కూడా చదవండి: వైట్ పెప్పర్ వర్సెస్ బ్లాక్ పెప్పర్.. రెండింటిలో ఏది బెటర్
శిశువు చర్మానికి హాని కలిగించదని, పెరుగుదలపై ప్రభావం పడదని చెబుతున్నారు. శిశువు చర్మం రంగు జన్యుపరమైన కారకాలు, మెలనిన్ ఉత్పత్తి ద్వారా నిర్ణయించబడుతుంది. తల్లి చర్మంపై వర్తించే వాటి ద్వారా ఎలాంటి ప్రభావం ఉండదని వైద్యులు అంటున్నారు. గర్భధారణ సమయంలో స్త్రీలు పారా-ఫెనిలెనిడియమైన్ (PPD) వంటి రసాయనాలు కలిగిన హెన్నాను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు. నేచురల్ హెన్నాను ఎప్పుడూ వాడటం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: షుగర్ లెవెల్ 300 దాటితే వెంటనే ఈ చెట్టు ఆకులను నమలండి