BC Welfare : హాస్టల్ లో సరైన వసతులు లేవంటూ ఏపీలో బీసీ వసతి గృహం విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వార్డెన్ రావాలి ఆకలి తీర్చాలి అంటూ బీసీ బాలుర వసతి గృహం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. పేరుకే బీసీ బాలుర వసతి గృహం కానీ.. తామంతా ఆర్దకాలితో అలమటిస్తున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: వారిపై చిన్న గాటు పడినా తాట తీస్తా.. పవన్ ఫైర్!
40 రోజులుగా సరైన ఆహారం లేదంటూ..
ఈ మేరకు హాస్టల్ లో 40 రోజులుగా సరైన ఆహారం పెట్టడం లేదని, వసతులు కూడా కల్పించట్లేదని ఆరోపించారు. వసతులు కల్పించడంలో వార్డెన్ నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రోజూవారి పెట్టే ఆహారం బిల్లులు రావడం లేదని, మజ్జిగ అన్నం పెడుతున్నారని చెప్పారు. 40 మంది విద్యార్ధులకు 5 బాత్ రూమ్ లు ఉండగా 2 బాత్ రూమ్ లే పనిచేస్తున్నాయని, ఆ హాస్టల్ లో పని చేస్తున్న ఆయా సగం డబ్బులతో మిగతావి అరువు తెచ్చి ప్రతి రోజు తమ ఆకలి తీరుస్తున్నారని విద్యార్దులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మా ఆకలి తీర్చాలని విద్యార్దులు కోరారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కుల గణన చేసేది అందుకోసమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్