Ap: ఏపీని వరుణుడు మరోసారి పలకరించనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఇటీవలి కాలంలో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వానలు పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్షాలు కురిశాయి. అయితే ఇప్పుడు మరోసారి ఏపీలో వానలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నవంబర్ 23 వ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: AP:తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?
నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. ఈ ఆవర్తనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా
నైరుతి బంగాళాఖాతంలో..
ఆ తర్వాత రెండు రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో నవంబర్ 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్త సూచించింది. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్
అలాగే కాలువలు, కల్వర్టుల సమీపానికి వెళ్లవద్దని సూచించారు. రెండు రోజుల పాటుగా భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు నవంబర్ 27,28వ తేదీల్లో సముద్రంలోకి చేపలవేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.