/rtv/media/media_files/2025/09/22/apco-announced-dusshera-and-diwali-festival-discount-on-chenetha-cloths-2025-09-22-21-52-02.jpg)
apco announced dusshera and diwali festival discount on chenetha cloths
దసరా, దీపావళి నేపథ్యంలో ఆప్కో భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పండగలను తెలుగుదనం ఉట్టిపట్టేలా జరుపుకోడానికి చేనేత వస్త్రాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ అందజేయాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేత పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు నేతన్నలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరో వైపు చేనేత వస్త్రాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది.
apco festival discount on chenetha cloths
అదే సమయంలో చేనేత దుస్తుల వినియోగంలో పెరిగేలా భారీ డిస్కౌంట్లు అందజేయడంతో పాటు ఈ కామర్స్ లో అమ్మకాలకు పెట్టింది. నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేనేత దుస్తులను డోర్ డెలివరీ చేస్తోంది. అదే సమయంలో దసరా, దీవాళి పండుగలను దృష్టిలో పెట్టుకుని చేనేత బట్టలు కొనుగోలు చేస్తే... 40 శాతం తగ్గింపు అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశాలతో ఆప్కో నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా యావత్ జాతీయ స్థాయిలో దాదాపు 92 ఆప్కో షోరూమ్‌లున్నాయి. ఈ షోరూమ్‌ల్లో కొనుగోలు చేసే చేనేత వస్త్రాలపై దాదాపు 40% భారీ డిస్కౌంట్ అందజేయనున్నారు. ఇంటిల్లపాది చేనేత దుస్తులు ధరించి.. దసరా, దీపావళి పండగలు తెలుగింటి సంప్రదాయంలో ఘనంగా నిర్వహించుకోడానికి ఈ భారీ డిస్కౌంట్ దోహదపడడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది.
*ఆప్కో పండగ బొనాంజా * చేనేత వస్త్రాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ * దసరా, దీపావళి నేపథ్యంలో భారీ డిస్కౌంట్ * అన్ని...
Posted by I & PR Andhra Pradesh on Monday, September 22, 2025
40 శాతం డిస్కౌంట్
దసరా, దీపావళి పండగ నేపథ్యంలో ఆప్కో షోరూమ్‌ల్లో చేనేత వస్త్రాలను కొనుక్కుంటే 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. ఇందులో భాగంగా సోమవారం ఆమె ఒక ప్రకటన రిలీజ్ చేశారు. చేనేత దుస్తులపై 40 శాతం డిస్కౌంట్ తో వినియోదారులకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుందన్నారు. అదే సమయంలో చేనేత దుస్తుల అమ్మకంతో నేతన్నలకు కూడా ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు, చేనేతల కుటుంబాల్లో ఆనందాలు నింపడమే లక్ష్యంగా 40 శాతం డిస్కౌంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలు తెలుగింటి సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిబింబమన్నారు. ఇంటిల్లపాది చేనేత దుస్తులు ధరించి నేతన్నలకు అండగా నిలుద్దామని.. దసరా, దీపావళి పండగలను సంతోషంగా జరుపుకుందామని మంత్రి సవిత ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.