జగన్ హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు రూ.222 కోట్లు.. సంచలన విషయాలు లీక్ చేసిన TDP

 మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.

New Update
lokesh

చార్టర్డ్ విమానాల వినియోగం విషయంలో ఏపీలో మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆయన విమాన ప్రయాణాల కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఏకంగా రూ. 222 కోట్లు ఖర్చు చేశారు. మంత్రి నారా లోకేష్ మాత్రం తన అధికారిక పర్యటనల కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులను వినియోగించలేదంటూ రెండు ప్రధాన పార్టీల మధ్య కొత్త వాదోపవాదాలకు దారితీశాయి.

కొడమల సురేష్ బాబు అనే వ్యక్తి

 మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు. అయితే, కొడమల సురేష్ బాబు అనే వ్యక్తి దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తు ఈ వివాదానికి తెరదించింది. మంత్రి లోకేష్ తన 77 హైదరాబాద్ పర్యటనలకు అయిన ఖర్చును తన సొంత డబ్బుల నుంచే చెల్లించారని ఆయన శాఖ అధికారికంగా ఆర్టీఐలో వెల్లడించింది.  

దీనిపై టీడీపీ సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తీరుతో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేసింది. "ఎన్డీఏ ప్రభుత్వంలో 18 నెలల మంత్రిగా ఉన్న నారా లోకేష్, తన పర్యటనల కోసం ఉపయోగించిన హెలికాప్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ, ముఖ్యమంత్రిగా 60 నెలలు పనిచేసిన జగన్, తన పర్యటనల కోసం ఉపయోగించిన హెలికాప్టర్లకోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 222 కోట్లు ఖర్చు చేశారంటూ టీడీపీ పోస్ట్ చేసింది. 

 మంత్రి లోకేష్ బాధ్యతాయుతంగా సొంత నిధులు వాడగా, జగన్ రెడ్డి మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారంటూ టీడీపీ ఈ పోలికను జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ గణాంకాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisment
తాజా కథనాలు