/rtv/media/media_files/2025/02/27/VN8LiHJKhkhiqOQaib47.jpg)
bheemavaram
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమంలో భాగంగా బాణాసంచా కాలుస్తుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పందిరిపై ప్రమాదవశాత్తు ఓ తారాజువ్వ ఎగిరి పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతుండడంతో ఆలయంలోని భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. కొంతమంది సాహసం చేసి పందిరి పై తాటాకులను తీసి కింద పడేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Also Read:Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు
అగ్ని ప్రమాదం!
భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి వారి రధోత్సవ కార్యక్రమంలో బాణాసంచా కాల్చుతుండగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరిపై పడిన తారాజువ్వ.
— RTV (@RTVnewsnetwork) February 27, 2025
ఒక్కసారిగా వ్యాపించిన మంటలు....
సాహసం చేసి చలువ పందిరిపైకెక్కి తాటాకులను కిందికి పడేసిన కొందరు భక్తులు #Bhimavaram… pic.twitter.com/U8i4catiPU