/rtv/media/media_files/2024/11/03/sbZR9y9lbjK63Yy1FTw3.jpg)
AP Ration Cards: ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకూ.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. ఏపీలో ప్రజలు.. కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకునేందుకు ఏర్పాటు చేసింది. ప్రభుత్వం.. ఈ దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన వారికి సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆ ప్రకారం.. సంక్రాంతి పండుగ నాడు.. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా.. జిల్లాల్లో అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Watch Video: తుపాను ఎఫెక్ట్, విమానం ల్యాండ్ అయ్యేందుకు ఆటంకం.. చివరికి
కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్టులను మార్చాలనుకుంటున్న విషయం తెలిసిందే. అందువల్ల కొత్త రేషన్ కార్డులను పసుపురంగులో ఉండేలా, ఏపీ గవర్నమెంట్ ముద్ర మాత్రమే వాటిపై ఉండేలా ముద్రిస్తోంది అయితే ఈ పసుపు రంగు ఉండటంపై కూడా విమర్శలు వినపడుతున్నాయి.
Also Read: చెక్ పవర్ రద్దు.. కలెక్టర్లకు ఆ అధికారం కట్.. పంచాయతీ రాజ్ చట్టంలో రానున్న మార్పులివే!
టీడీపీ జెండా రంగును రేషన్ కార్డులకు ఎంపిక చెయ్యడం సరికాదని కొందరు పేర్కొంటున్నారు. వైసీపీ చేసినట్లే, టీడీపీ కూడా చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందువల్ల చాలా మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డుల్లో మార్పులు-చేర్పులూ చెయ్యాల్సి ఉంది. చాలా మంది పెళ్లైన వారు.. ఆల్రెడీ ఉన్న కార్డుల్లో తమ పేరును తొలగించుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఆ పార్టీ నుంచే సీఎం.. అజిత్ పవార్ సంచలన ప్రకటన
అలాగే కొత్తగా పెళ్లైన కుటుంబంగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది చనిపోయిన వారున్నారు, కొత్తగా పుట్టిన వారూ ఉన్నారు. ఇలా ప్రస్తుత రేషన్ కార్డుల్లో చాలా మార్పులు చెయ్యాల్సి ఉంది. డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల్లో మార్పులు చెయ్యడానికి వీలవుతుంది. ఆ రోజున మాత్రమే సర్వర్ అందుబాటులోకి వస్తుంది. అందువల్ల అధికారులు డిసెంబర్ 2 నుంచి మాత్రమే రేషన్ కార్డుల మార్పుల దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Also Read: కాలయముడైన తాగుబోతు..! అనాథలుగా మారిన ఇద్దరు పసివాళ్లు! వీళ్ళ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు
సచివాలయాలకు వెళ్లి, దరఖాస్తు ఫారాలను తీసుకోవచ్చు. లేక ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ (https://epds2.ap.gov.in/epdsAP/epds)లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా.. రిజిస్టర్ అయ్యి, తర్వాత లాగిన్ అవ్వాలి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఫారంపై క్లిక్ చేసి, వివరాలు నింపి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి.