/rtv/media/media_files/2025/03/25/2BhqKYcaiJA5p6UvAXFE.jpg)
Ap nandigama case
AP Crime: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఓ బాలింతను అత్తరింటివారు వేధింపులకు గురి చేస్తున్న ఘటన కలకలం రేపుతోంది. తమ్ముడు కానిస్టేబుల్ అండతో మరిన్ని డబ్బులు తీసుకురావాలంటూ బాధితురాలి భర్త ఆమె తల్లిదండ్రులను టార్చర్ గురి చేయడం సంచలనంగా మారింది.
11 నెలలుగా వేధింపులు..
ఈ మేరకు కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన చిల్లా వంశీ కృష్ణకు 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఎరిపాలెం మండలం తెల్లపాడు గ్రామానికి హరిప్రియను ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరికి ఇటీవల ఆడపిల్ల పుట్టింది. దీంతో తమ ఇంట్లోకి రావద్దంటూ వంశీ తమ్ముడు కానిస్టేబుల్ విజయ్ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డాడు. 11 నెలలుగా వేధిస్తున్నారంటూ బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
వంశీ కృష్ణ తమ్ముడు (సివిల్ కానిస్టేబుల్) విజయ్ కృష్ణ.. డబ్బులు తీసుకుని రావాలని వేధిస్తున్నాడు. 'మా తమ్ముడు కానిస్టేబుల్ మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. నీ దిక్కు ఉన్నా చెప్పుకో. బంగారం, డబ్బులు తీసుకుని రావాలి. లేకపోతే ఇంటిలోకి రావొద్దు మాకు అందరూ కొడుకులు పుట్టారు నీవు ఆడపిల్లను కన్నావు' అని తనను కొట్టినట్లు హరిప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తన మరిది విజయ్ కృష్ణ తన భర్త దూరం చేశాడని, కలవకుండా చేస్తున్నాడని హరిప్రియ కన్నీరు మున్నీరవుతోంది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది.
Also Read: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
nandigama | conistable | Wife Torcher | today telugu news