Ap State: రాష్ట్రంలోని నగరాల్లో నిర్మించే 100 గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ మంజూరు ప్రక్రియ అవసరం లేదని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు. శనివారం ఆయన విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయస్వామి, విశాఖ ఎంపీ శ్రీ భరత్ తో కలిసి జీవీఎంసీ , వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ...భవన నిర్మాణ అనుమతుల విధానాలను పరిశీలించి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. 300 గజాల్లోపు గృహాలకు సులభతరంగా ప్లాన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని వివరించారు.
Also Read: మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ!
పెండింగ్ దస్త్రాల వివరాలను డీటీసీపీ వెబ్ సైట్ లో నమోదు చేయిస్తామని చెప్పారు. టీడీఆర్ ల వివరాలు, ఇతర అంశాలు ఆన్ లైన్ లో ఉంచుతున్నట్లు వివరించారు. అనంతరం వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టుల పురోగతి పై ఆరా తీసి, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
Also Read: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన
మాస్టర్ ప్లాన్ రహదారుల రూపకల్పన, నిధుల సమీకరణ, మెట్రో రైలు, డీపీఆర్, టిడ్కో గృహాల పురోగతి వంటి అంశాలపై చర్చించారు.
Also Read: 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..బడ్జెట్ కూడా!
ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!
ఏపీలో ఉచిత సిలిండర్ పథకం కింద 31వ తేదీ నుంచి సిలిండర్లు అందిస్తున్నారు. అయితే కొందరు ఈ పథకానికి అర్హులు కాదమోనని సందేహంగా ఉంటున్నారు. ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకోవాలంటే తప్పకుండా ఆధార్, రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.
ఒకవేళ భార్య పేరుతో రేషన్ కార్డు ఉండి, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న కూడా ఈ ఉచిత సిలిండర్ పథకానికి అర్హులు. అయితే రేషన్ కార్డులో సభ్యుల పేర్లతో రెండు కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నా కూడా రాయితీ కేవలం ఒక్క కనెక్షన్‌కి మాత్రమే వర్తిస్తుంది. గ్యాస్ రాయితీ డబ్బులు తిరిగి అకౌంట్లోకి పడాలంటే కేవైసీ తప్పకుండా పూర్తి చేసి ఉండాలి.