/rtv/media/media_files/2025/06/17/RiObV04w91cPvSTSZilg.jpg)
ap dsc exams 2025 preliminary key released today
ఆతృతగా ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ గవర్నమెంట్ శుభవార్తను చెప్పింది. మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ప్రకటించారు. తమ వ్యక్తిగత లాగిన్ లోకి వెళ్ళి స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. తుది కీ విడుదల చేశాక...అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, సవరించి...నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా తుది ఫలితాలను విడుదల చేశామని కృష్ణారెడ్డి తెలిపారు. అలాగే టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఎవరికి వారే వాటిని సరి చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
స్కోరు కార్డ్ డౌన్ లోడ్ విధానం..
పరీక్షలు రాసిన అభ్యర్థులు వెబ్ సైట్ లోకి వెళ్ళి తమ వ్యక్తిగత లాగిన్ లోకి వెళ్ళాలి. అక్కడ తమ హాల్ టికెట్ నంబర్, పాస్ వర్డ్ ఇచ్చి..సర్వీసెస్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఏపీ డీఎస్సీ ఫలితాలను సెలక్ట్ చేసుకుంటే స్కోరు కార్డు కనిపిస్తుంది. అక్కడే మొత్తం అభ్యర్థుల లిస్ట్, పేపర్లు, స్కోర్స్, క్వాలిఫై అయ్యారా లేదా అనే మొత్తం వివరాలు ఉంటాయి.
AP mega Results relwat
— Telugu News.. The Truth (@kgk642013) August 11, 2025
ఏపీ మెగా DSC ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను https://t.co/8q5HXjBgku
లో తెలుసుకోవచ్చు. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం DSC నిర్వహించిన సంగతి తెలిసిందే. pic.twitter.com/Ns1FGtlMAS
16,347 టీచర్ పోస్టులు..
ఏపీలోని ప్రభుత్వ స్కూల్‌లలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు మొత్తం 3.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తులు రావడంతో మొత్తం 5, 77, 417 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి 7159 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 39,997 మంది మెగా డీఎస్సీకి అప్లై చేసుకున్నారు. అత్యల్పంగా 15, 812 మంది కడప జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్నారు.