Liquor Shops Lottery: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం లాటరీ తీయనున్నారు. 26 జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. జిల్లా గెజిట్ లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీయనున్నారు. అన్ని జిల్లాలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అత్యధికంగా తిరుపతి లో..
రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాలకి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం 3,396 మద్యం దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా 89,882 దరఖాస్తులు వచ్చాయి.
Also Read: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు
నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 1,797.64 కోట్ల మేర ఆదాయం సమకూరింది. లక్ష వరూ దరఖాస్తులు వస్తాయని, రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అనుకున్నారు.
కానీ కొన్ని జిల్లాల నుంచి చాలా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు దరఖాసత్ఉలు వేయనివ్వకుండా అడ్డుకోవడం, కొన్ని చోట్ల మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.
కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఒక్కో దుకాణానికి రెండు , మూడేసి దరఖాస్తులే వచ్చాయి.
Also Read: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్ డౌటే
అత్యధికంగా ఈ జిల్లా నుంచే..
రాష్ట్రంలో సగటున ఒక్కో మద్యం దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51-52 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి ఏలూరు జిల్లాలో 38, తూర్పుగోదావరి , గుంటూరు జిల్లాల్లో 35, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 32, కర్నూలు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 30 దరఖాస్తులు వచ్చాయి.
Also Read: గుజరాత్‌లో 5వేల కోట్ల డ్రగ్స్ సీజ్
10 కంటే తక్కువ దరఖాస్తులు..
రాష్ట్రంలో ఒక్క దరఖాస్తు రాని దుకాణాలు ఏమి లేవు. మూడేసి దరఖాస్తులు వచ్చినవి 12, నాలుగేసి వచ్చినవి 5, ఐదేసి వచ్చినవి 12, 213 దుకాణాలకు పది , అంతకంటే తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం అనంతపురం, తిరుపతి, శ్రీసత్యసాయి , అన్నమయ్య, వైఎస్సాఆర్, నంద్యాల జిల్లాలోనే ఉన్నాయి.
40 కంటే ఎక్కువ దరఖాస్తులు..
రాష్ట్రంలో 4 దుకాణాలకు 100 కంటే ఎక్కువగా దరఖాస్తులు అందాయి. అందులో మూడు ఎన్టీఆర్ జిల్లాలోనివే, 2 దుకాణాలకు 90-99 మధ్యలో దరఖాస్తులు రాగా, 6 దుకాణాలకు 80-89, 17 దుకాణాలకు 70-79, 32 దుకాణాలకు 60-69, 124 దుకాణాలకు 50-59 మధ్య దరఖాస్తులు, 321 దుకాణాలకు 40-49 మధ్య దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 506 దుకాణాలకు 40 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!