BIG BREAKING: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి న్యాయస్థానం మూడు రోజుల రిమాండ్ విధించింది. వయస్సు రీత్యా వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది.

New Update

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా అరెస్ట్ అయిన సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మూడు రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 20 వరకు వీరి రిమాండ్ కొనసాగనుంది. వయస్సు రీత్యా వీరికి ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వెస్ట్రన్ టాయిలెట్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ కు అనుమతించింది. ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని జైలు అధికారులకు ఆదేశించింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు