ఏంటి బ్రో ఇంత తాగేశారు.. మూడు రోజుల్లో మరీ ఇన్ని కోట్ల ఆదాయమా

ఏపీలో నూతన మద్యం విధానం మొదలైన మూడురోజులకే కోట్లలో ఆదాయం వచ్చింది. మూడు రోజులకే రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకాలు, 1,94,261 బీర్ల అమ్మకాలు జరిగాయని అన్నారు.

Wine Shops
New Update

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నూతన మద్యం విధానం అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నూతన మద్యం విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చారు. ఇటీవలే ఈ నూతన మద్యం షాపుల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ జారీ చేసి.. దరఖాస్తులు స్వీకరించారు. 

ఇది కూడా చూడండి: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు లాటరీ డ్రా నిర్వహించారు. మొత్తం 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు వచ్చాయి. వీటికి కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు లాటరీ తీసి మద్యం షాపుల విజేతల్ని ప్రకటించారు. మద్యం షాపులు గెలుపొందిన వారు వచ్చే రెండేళ్ల వరకు వ్యాపారం చేసుకోవచ్చు. ఈ లిక్కర్ షాపుల దరఖాస్తు ప్రక్రియతో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల ఆదాయం వచ్చింది.

ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి

అనంతరం అక్టోబర్ 16 నుండి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే గతం కంటే ఈసారి రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం అందుబాటులో తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. ధర కూడా తక్కువగానే ఉండటంతో మందు బాబులు తమ సత్తా చాటారు. కేవలం రూ.99 లకే క్వార్డర్ బాటిల్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ మూడు రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల వివరాలను ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

మూడు రోజుల్లో కోట్ల విలువైన మద్యం అమ్మకాలు

దీని బట్టి చూస్తే ఏపీలో మద్యం ప్రియులు వారి తడాఖా చూపించినట్లు తెలుస్తోంది. తాము తలచుకుంటే ప్రభుత్వానికి ఎంతటి ఆదాయాన్ని అయినా తెచ్చిపెడతామన్నట్లుగా చేశారు మందుబాబులు. నూతన విధానం మొదలైన మూడురోజులకే కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులకే రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకం జరిగిందని అన్నారు. అదే సమయంలో 1,94,261 బీర్ల అమ్మకాలు జరిగాయని అన్నారు. దీంతో రాష్ట్రంలో మందు బాబులో ఏ లెక్కన తాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్! 

#ap Liquor Policy news #ap liquor latest news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe