కడపలో తప్పిన పెనుప్రమాదం.. అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న కాలేజీ బస్సు..

కడప జిల్లా జంగంపల్లె వద్ద ప్రగతి జూనియర్ కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కోగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయాలైన డ్రైవర్, విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.

New Update
road accident

Road Accident

AP News: కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సు మంగళవారం ఉదయం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది.  ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కొగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.  మరికొందరు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయట పడ్డారు.ఈ ఘటన కడప జిల్లా కమలాపురం మండల పరిధిలోని జంగంపల్లె వద్ద చోటుచేసుకుంది.  ప్రమాదానికి గురైన బస్సు ప్రగతి జూనియర్ కాలేజీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్..

ఈ ఘటనలో విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న  డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులుకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు నిబంధనల మేరకు బస్సుకు ఫిట్‌నెస్‌ ఉందా?, లేదా ప్రమాదానికి గల కారణం ఏంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పాదాలు పగిలి నడవలేకపోతున్నారా..?..ఇది ట్రై చేయండి

Advertisment