Ap Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరగనుంది. తర్వాత ప్రభుత్వం సభలో మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనుండగా... ప్రభుత్వ ఉద్యోగుల సవరణ బిల్లు-2024 ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
Also Read: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!
చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల అధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డిఎస్సీ-1998.. తదితర వాటిపై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 -25 ఆర్దిక బడ్జెట్‌పై చర్చ జరుగనుంది.
Also Read: Jharkhand Elections:జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం
ఉచితపంటల భీమా పథకం..
బుధవారం ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. కైకలూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మత్తులు, 2019 -24 వరకు మద్యం అమ్మకాలలో జరిగిన అక్రమాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంట రుణాలపై అధిక వడ్డీ, ఫ్రీ హోల్డ్ భూములు క్రమబద్దీకరణ, విజయనగరంలో ఆతిసారం, పీడీఎస్ బియ్యం అక్రమాలు, ఉచితపంటల భీమా పథకం, పంచాయితీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్ను తదితర అంశాలపై చర్చ జరగనుంది. అనంతరం 2024 - 25 ఆర్ధిక బడ్జెట్‌పై చర్చ జరగబోతుంది.
Also Read: Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...!
Also Read: Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!