Pastor : పాస్టర్లకు గుడ్ న్యూస్.. గౌరవ వేతనం అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏపీ ప్రభుత్వం పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు ఈ వేతనాలు విడుదల చేయనున్నారు.

New Update

Pastor: గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏపీ ప్రభుత్వం పాస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు- గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.-- 2024 మే నుంచి నవంబర్ వరకు ఈ వేతనాలు విడుదల చేయనున్నారు. అయితే మొత్తం 7 నెలల కాలానికి గాను రూ.30 కోట్లు విడుదల చేయనుండగా.. ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్ధి చేకూరనుంది. 

పాస్టర్ ప్రవీణ్‌ ది హత్యే..

మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ఈ రోజు మీడియాతో పాల్ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్‌ ది హత్య అనే చెప్పేందుకు తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని హై కోర్టులో కూడా తాను చెప్పానన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు. చనిపోయి 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి ఇవ్వలేదని ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి: ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

church-father | cm chandraabu 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు