ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

New Update

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ట్వీట్‍పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఏపీలో విమాన సర్వీస్‍ల జాప్యంపై గంటా శ్రీనివాస్ నిన్న ట్వీట్ చేశారు. ఏపీ టూ ఏపీ వయా తెలంగాణ అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్.. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కూడా మన పార్టీ వారే కదా అని గంటాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు రామ్మోహన్‍కి ఫోన్ చేయొచ్చు కదా..? అని ఫైర్ అయినట్లు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావొద్దని గంటాకు టీడీపీ హై కమాండ్ స్పష్టం చేసినట్లు చర్చ సాగుతోంది. 

ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..

విశాఖ నుంచి అమరావతికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని నిన్న గంటా ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ''ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టు లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు...

విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి''.. అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సొంత పార్టీ అధికారంలో ఉండడం.. నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేసే ఛాన్స్ ఉన్నా గంటా సోషల్ మీడియాకు ఎక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో హైకమాండ్ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు