AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...వారందరికీ పింఛన్లు కట్! ఏపీ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అర్హులైన కొత్తవారికి పెన్షన్లను ఇస్తామని ప్రకటించిన క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు ప్రభుత్వం రెడీ అవుతుంది. అనర్హులపై వేటుకు సర్కార్ సిద్దమవుతుంది. By Bhavana 23 Sep 2024 | నవీకరించబడింది పై 23 Sep 2024 11:56 IST in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Ap Government: ఏపీ ప్రభుత్వం పించన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్తవారికి పెన్షన్లను ఇస్తామని ప్రకటించిన క్రమంలో నూతన దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే అనర్హులపై వేటుకు సర్కార్ సిద్దమవుతుంది. అర్హత లేకపోయినా సరే కొందరు పింఛన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అలాంటి వారిపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనర్హుల ఏరివేతకు కసరత్తులు మొదలుపెట్టింది. వైసీపీ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు.. ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. కొంతమందికి అనర్హత ఉన్నప్పటికీ వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అర్హత ఉన్నా ఏవేవో కారణాలు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా దరఖాస్తుల్ని పక్కనపెట్టారని కొంతమంది ఆరోపించారు. గత ఐదేళల్లో 8లక్షల మందికి పింఛన్లు తొలగించారనే విమర్శలే వినిపిస్తుండటంతో సర్కార్ రంగంలోకి దిగింది. దీంతో కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని భావిస్తోంది. ఆ దిశగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొత్త పింఛన్లపై విధివిధానాల రూపకల్పన కోసం ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఓ యాప్ తీసుకురావాలని భావిస్తోంది. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీకి ఈ యాప్ రూపొందించాలి అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్రస్థాయిలోనే అర్హులు, అనర్హులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీరిలో కూడా ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఇలా జాబితాలను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుంది. Also Read : రణబీర్ క్యారెక్టర్‌ని ఎందుకు దూషించరు? తను మగాడనా?.. త్రిప్తి అదిరిపోయే రిప్లై #ntr-bharosa #ap-pension #ap-government సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి