Vijayawada:బెజవాడ కనక దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు..ఎందుకంటే!

నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరిరోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను అధికారులు రద్దు చేశారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

bezawda
New Update

Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రులు  నేటి (శనివారం) తో పూర్తి కానున్నాయి. చివరిరోజు ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 
 

Also Read: దసరా రోజు ఈ పుష్పంతో పూజిస్తే.. ఇళ్లంతా కాసుల వర్షం

అయితే ఉత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు నిర్వహించే దుర్గమ్మ హంస వాహనం సేవను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Also Read: డోనాల్డ్ ట్రంప్ ప్రకటనపై కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్

అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు వచ్చి కృష్ణానదిలో చేరుతోంది. దీంతో అధికారులు కనకదుర్గమ్మ హంస వాహనసేవను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు, ఆలయ కమిటీ అధికారులు తెలియజేశారు. అయితే అమ్మవారి జలవిహారం రద్దు కావటంతో ప్రభుత్వం ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. 

Also Read: ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు!

అందులో భాగంగా దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పనులు చేపట్టారు.అయితే హంసవాహన సేవలో భాగంగా దుర్గమ్మ హంస వాహనంలో.. కృష్ణా నదిలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఈ సేవను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో విజయవాడ వస్తుంటారు. అయితే నీటి ప్రవాహం కారణంగా ఈ ఏడాది హంసవాహన సేవ రద్దు అయ్యింది. 

Also Read:  లెబనాన్‌లోని ఐరాస కార్యాలయం పై దాడి..ఖండించిన భారత్‌!

మరోవైపు అక్టోబర్ మూడో తేదీ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఇన్నిరోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ.. శనివారం శ్రీరాజరాజేశ్వరిదేవీగా కనిపించనున్నారు. నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అదికారులు, ప్రభుత్వ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

Also Read:  బొగ్గుగనిలో దుండగుడి కాల్పులు...20 మంది మృతి!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe